ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. 2500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

-

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చింది..యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రముఖ ఈకామర్స్ సంస్థ ప్లిప్ కార్ట్ ముందుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి, సీఈఓ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు. తాడేపల్లిలో ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో ఏపీఎస్ఎస్డీసీ మరియు ఫిప్ కార్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకన్నాయి..

ఈ మేరకు దాదాపు 2500 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వీటిని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఫ్లిప్కార్ట్ తెలిపింది.ఇందులో భాగంగా 75 శాతం  మందికి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించగా,మిగిలిన 25 శాతం ఓపెన్ క్యాటగిరీ కింద భర్తీ చేయనున్నారు. స్థానిక యువతకు ఇలా రిజర్వేషన్ కల్పించడంలో.. ఏపీ సీఎం జగన్ పాత్ర అమోఘమన్నారు. ఈ నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్లిప్ కార్ట్ ముందుకు రావడం అభినందించాల్సిన విషయం అన్నారు.

నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని, ఫ్లిప్కార్ట్ అధికారులు తెలిపారు.ఏపీ యువతకు ఉద్యోగాలు కల్పింటకు ఫిప్ కార్ట్ కూడా భాగస్వామి అవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు..

అర్హతలు: పది, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసి ఉండాలి..

జీతం: రూ.18,000 నుండి రూ.3,00,000..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వారు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లో నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version