అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి.. అందులోకి మాజీ ఎమ్మెల్యే,ఎంపీ, ఎమ్మెల్సీలకు నో ఎంట్రీ!

-

అసెంబ్లీ చరిత్రలో తొలిసారి మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లోకి నో ఎంట్రీ అని బోర్డులు దర్శనమిచ్చాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను చూడలేదని మాజీ ప్రజాప్రతినిధులు నోరెళ్లబెడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అసెంబ్లీలోని ఇన్నర్ లాబీలోకి అనుమతి లేదంటూ బోర్డులు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీడియాపై కూడా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించడంతో పాటు చట్ట సభ సభ్యులు, ఇతరులు ఫోటోలు, వీడియోలు కూడా తీయొద్దని అసెంబ్లీ ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నిర్ణయం పట్ల చట్టసభల మాజీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రేవంత్ పాలన ప్రజా ఆమోదయోగ్యంగా లేదని, ప్రజాప్రతినిధులు సైతం చీదరించుకునేలా ఉందని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version