జ‌న‌సేన‌తో కలిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

-

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ – జ‌న‌సేన పొత్తు ఉంటుంద‌ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జ‌న‌సేన‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాగ త‌మ‌కు జ‌న‌సేన‌తో పొత్తు గురించి అమిత్ షా నుంచి రెండు నెల‌ల క్రిత‌మే రోడ్ మ్యాప్ వ‌చ్చింద‌ని సోము వీర్రాజు అన్నారు. కాగ నిన్న జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సోము వీర్రాజు స్పందించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

తిరుప‌తి మీటింగ్ స‌మ‌యంలోనే త‌మ‌కు అమిత్ షా దిశా నిర్ధేశం చేశార‌ని తెలిపారు. 2024లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి జ‌న‌సేన‌తో క‌లిసి పోరాడుతామ‌ని అన్నారు. కాగ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. గ‌త కొద్ది రోజుల నుంచి బీజేపీ ప్ర‌తినిధులతో కూడా ట‌చ్ లో ఉంటున్నార‌ని ప్ర‌క‌టించారు. కాగ మార్చి 19న ఛ‌లో క‌డ‌ప‌కు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. రాయ‌ల‌సీమ ర‌ణ‌భేరి చేప‌ట్టనున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం పై ఒత్తిడి తీసుకువ‌స్తామ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version