జలమండలికి ఇస్తానన్న 500 కోట్లు ఎక్కడ : చింతల రామచంద్రారెడ్డి

-

హైదరాబాద్‌లో నాలాల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వచ్చిన భారీ వర్షాలకు మూసి పొంగిపొర్లడంతో.. హైదరాబాద్ రోడ్లు, వీధులన్నీ జలశయాలుగా మారాయి. హైదరాబాద్‌లో నాలాల సమస్యను పరిష్కరిస్తామని గత ప్రభుత్వాలు, ఇప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఖైరాతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో కలుషిత నీళ్లు త్రాగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని, ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదని ఆయన అన్నారు.

నిజాం కాలంలో వేసిన పైపులైన్ లే ఇప్పటికి ఉన్నాయని, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను విమర్శించిన కేసీఆర్… ఎనిమిదేళ్లు అయిన సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నాలాల్లో పూడిక తీయడం లేదని, వర్షాకాలంలో సమస్యల వస్తే అప్పటికప్పుడు పూడికతీతలు చేపడుతారా..? అని ఆయన ప్రశ్నించారు. శివారు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలను వాటర్ బోర్డ్ గాలికొదిలేసిందని, రాష్ట్ర ప్రభుత్వం జలమండలి కి ఇస్తానన్న 500 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news