కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ మరణించారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ కు ఈ నెల 4వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడగవతో.. హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుటుంబ సభ్యులు.
అయితే.. మే 7 వ తేదీన మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అయితే.. పండిట్ సుఖ్ రామ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు. ఈ మేరకు పండిట్ సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తన సోషల్ మీడియా వేదికగా… ఈ విషాద వార్తను ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నేతలు సంతాపం తెలిపారు. ఇక ఆయన అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి.