ఘోర ప్రమాదం.. విష వాయువు పీల్చి నలుగురు మృతి

-

ఎందుకు జరుగుతున్నాయో.. ఎలా జరుగుతున్నయో తెలియదు గానీ.. గ్యాస్‌ లీక్‌లతో కార్మికులు చావుతో పోరాడుతున్నారు. ఇప్పటికే ఏపీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా.. హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోహాద్ ఫ్యాక్టరీ ప్రాంతంలో విష వాయువు కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. ఫ్యాక్టరీలోని ఓ రసాయన నీటిని నిల్వ చేసిన ట్యాంకులోకి శుభ్రం చేసేందుకు నలుగురు దిగగా.. విషయ వాయువులను పీల్చడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు అధికారులు. రోహద్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో
గ్యాస్కెట్‌ పేపర్‌ తయారవుతోంది. ఇందు కోసం రకరకాల రసాయనాలను ఉపయోగిస్తుంటారు.

158 Gas Leak Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

రసాయనాల వ్యర్థ జలాలు ఫ్యాక్టరీ వెనుక దాదాపు ఐదు అడుగుల లోతులో ట్యాంకులాంటి ప్రాంతంలోకి వెళ్తాయి. అది నిండిన తర్వాత ట్రాక్టర్‌ సహాయంతో తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ట్యాంక్‌ నిండగా.. వ్యర్థాలు పేరుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ఓ కార్మికుడు ఇందులోకి దిగగా.. వెంటనే స్పృహ కోల్పోయాడు. అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు మరో కార్మికుడు అందులోకి దిగగా స్పృహ కోల్పోయాడు. ఇలా కార్మికులు ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు వెళ్లి విషయ వాయువులు పీల్చి స్పృహ తప్పపడిపోయారు. వారందరినీ బయటకు తీయగా.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకొని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కలెక్టర్‌ విచారణ కోసం కమిటీని నియమించినట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news