26 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ : తలసాని

-

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం
డాక్టర్ బిఆర్అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాలతో ఈ సంవత్సరం చేప పిల్లల పంపిణీకి సంబంధించి సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ లాంచనంగా ప్రారంభిస్తారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో చేప పిల్లల పంపిణీ ని ప్రారంభించాలని, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యే లు, జెడ్పి చైర్మన్ లు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version