రేపే ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు.. వర్షాలు షురూ..

నిత్యం 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల రాకతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

India to receive more rainfall this monsoon, likely to enter Karnataka by  June 2

నైరుతి రుతుపవనాల కారణంగా ఆదివారం (జూన్ 5) మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా చిరు జల్లులు కురిసాయి. మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, మాగనూరు, నల్గొండ, హైదరాబాద్ వరంగల్‌ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.