మగాళ్ల మీద ఇంత కోపం ఎందుకు గలాటా గీతక్క..!!

-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం కూరగాయల మార్కెట్ లా నడుస్తోంది. హౌస్ లోని కంటెస్టెంట్లు  తమ చేస్టలతో పిచ్చెక్కిస్తున్నారు. చాలా  మంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూఉన్నారు. కంటెస్టెంట్లు ముందు ఒకలా తర్వాత ఒకలా ప్రవర్తిస్తూ వున్నారు.వీళ్ల దెబ్బకి గలాటా గీతుకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. దీంతో ఆమె దెబ్బకు ఎలిమినేట్ అయ్యింది.

చాలా మంది  ‘బిగ్ బాస్ కి పట్టిన దరిద్రం వదిలింది.. ఇక ప్రశాంతంగా చూడొచ్చు’ అని అనుకుంటున్నారు.కొంత మంది ఆమె ఏడుపు చూడలేక మళ్లీ లోపలకు పంపండి రా సామి అంటున్నారు..ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయివుండి కూడా కూడా నేను వెళ్ళను ఈడనే వుంటా అంటూ ఏడ్చింది. ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో లైవ్ ఇచ్చింది.. సుమారు గంటసేపు ఆమె ఈ లైవ్ వీడియోలో సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్.. బిగ్ బాస్ -4 టైటిల్ విన్నర్ అభిజీత్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

ఆమె మాట్లాడుతూ ‘మనం మగాళ్ల సమాజంలో బతుకుతున్నాం అంటూ . బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ . చివరి వరుకు ఎవరితో రిలేషన్ పెట్టుకోకుండా ఆట ఆడాడు.. అలా ఆయన ఆడినప్పుడేమో అద్భుతమైన గేమర్ అన్నారు.. అదే తరహాలో నేను ఆడితే నీకు మనసు లేదు.. నువ్వు మనిషివి కాదు అని నెగటివ్ కామెంట్స్ చేసారు’. ఇక బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ కూడా అమ్మా రాజశేఖర్ గారి సిగరెట్లు దాచిపెట్టాడు. అతని  స్ట్రాటజీ  సూపర్ అన్నారు..అదే నేను చేస్తే  కన్నింగ్ మనిషిని అన్నారు.. అందుకే నేను మేల్ డామినేషన్ సొసైటీ అంటున్నాను.. అందులో ఎలాంటి తప్పు లేదు’ అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version