ఒకనాడు పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుండి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. పార్వతి వానికి మమకారుడు అని పేరు పెట్టింది. చూస్తూ ఉండగానే వాడు. పెద్దవాడయ్యాడు. పార్వతి వానికి గడేకమంత్రాన్ని ఉపదేశించింది. తపస్సు చేయటం కోసం మమకారుడు అడవికి వెళ్లాడు. అక్కడ వానికి శంబరుడు అనే రాక్షసుడు సన్నిహితుడయ్యాడు. మమతారునకు అనేక మాయా విద్యలు నేర్చి, మమతానురా అని సంబోధించాడు. అప్పటి నుండి వాడు. మమతాసురుడయ్యాడు. పార్వతీదేవి చేసిన ఉపదేశంతో గణేశోపాసన ప్రారంభించాడు. సంధ్యప్తుడైన గణేశుడు
ప్రత్యక్షమయ్యాడు.
అప్పుడు ఆ రాక్షసుడు సమస్త లోకాలపై ఆధిపత్యాన్ని వరంగా పొందాడు. ఆ తరువాత శుభరాసురుని పుత్రిక మోహినిని వివాహం చేసుకున్నాడు. తన మమతా రాజ్యాన్ని అనురాగమయంగా లోకాలన్నింటా విస్తరించాడు. ద్వేషమెంత ప్రమాదకారియా మమతాను రాగములు కూడా అంత ప్రమాదకారులే. అవి ఆవహించిన వారు. తమ వారి కోసం ఎన్ని పాపములు చేయుటకైననూ వెనుకాడరు. అలా ధర్మము మమతవల్ల వంచితం అయింది. మంచివాళ్లకు కష్టాలొచ్చాయి. బాధితులైన దేవతలు, మునులు ఈ కష్టాన్ని తొలగించమంటూ శ్రీ గణేశుడిని శరణు వేడారు.
గణపతితో పోరు సలిపే మూషికాసురుడు తన విజయం కోసం మమతానురుని సాయం కోరాడు. మమత కాలసర్ప రూపం దాల్చి వచ్చింది. దాని కోడల నుండి వెలువడే భయంకర విషాగ్ని జ్వాలలకు ముల్లోకాలూ క్షోభ పడ్డాయి. కాలకూట విషాన్ని మించిన ఈ విషజ్వాలలకు జీవులందరూ తల్లడిల్లిపోతూ గణేశుని ప్రార్థించారు. విఘ్నరాజు గణపతిగా సాక్షాత్కరించిన గజాననుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాలలో వ్యాపించిన మమతా విషవాయువులను పీల్చివేశాడు. గణపతి ఉచ్చానల ప్రభావానికి మమతా సర్పం కూడా దుర్చుకుని తొండంలోకి వచ్చేసింది. దానిని నడుము చుట్టూ చుట్టి బంధించాడు. గణపతి. ఆ బిగింపుతో మమతా సర్పపు పొలుసులు ముగ్గు కాగా కోరలు ఊడిపడి రక్తధారలు కారాయి. దాంతో మమతా నరం శక్తిహీనమై ప్రాణభిక్ష కోరింది. కరుణించిన విఘ్నరాజు వినాయకుడు ఇలా అన్నాడు… మమతానురా! సర్పరాజా! జీవి శరీరము
మమతారాలు పెంచుకుని బంధాలు తెంచుకొనలేక ముక్తిని పొందలేకపోతున్నారు.
ఇకపై నన్ను సేవించిన నా భక్తులు నీ మాయలో చిక్కడ మమతా బంధముల నుండి విముక్తమై మోక్షము పొందుతారు అన్నాడు. అంతేగాకుండా నీవు నా వాహనమై నీ దరువైన నెమలితో కలిసి నా పాదాలు చెందనే ఉంటావు అని వరమిచ్చారు. అలా గణపతి సర్వవాహనుడుగా కూడా విరాజిల్లాడు. కాబట్టి ఈ వాటి పూజ ద్వారా భక్తులు పక్షపాతానికి దారితీసి పావడారణమయ్యే మమతను వీడి ధర్మబద్ధతను నేర్చుకోవాలి.
తొమ్మిదవనాటి ఘాతం విజయ గణపతి అమగ్రహింతు చేపట్టిన ప్రతిదార్వము విజయవంతం అవుతుంది.