BREAKING: పాతబస్తీలో గ్యాంగ్‌స్టర్ రియాజ్ పై కాల్పులు, హత్య

-

 

హైదరాబాద్‌ లో కాల్పుల కలకలం రేపాయి. పాతబస్తీ బాలాపూర్‌లో గ్యాంగ్‌స్టర్ రియాజ్ పై కాల్పులు చోటు చేసుకున్నాయి. బాలాపూర్‌లోని ఏఆర్‌సీఐ రోడ్డులో రియాజ్‌పై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ (39) మరణించారు. అటు పరార్ లో నిందితులు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాబా నగర్ సి బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు మృతుడు రియాజ్ (39). గతంలో పలు హత్య కేసుల్లో పలు నేరాల్లో రియాజ్ (39) ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.

Gangster Riaz shot dead in Old Town

రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు ఉన్నాయని సమాచారం. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో మృతుడు రియాజ్ నిందితుడుగా ఉన్నాడట. రౌడీ షీటర్ చాకు నజీర్ మృతుడు రియాజ్ ఇద్దరు మధ్య వైరం ఉందని సమాచారం. కారంతో కలిపి నీళ్లు రియాజ్ కళ్ళలో చల్లి… పిస్టల్ తో కాల్పులు జరిపారు. ఇక దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు బాలాపూర్ పోలీసులు. రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటి & హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version