కోహ్లీకి షోకాజ్​ నోటీసులు.. గంగూలీ కీలక వ్యాక్యలు

-

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. తన పై చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని భావించినట్లు వస్తున్న కథనాలపై సౌరవ్‌ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవి పచ్చి అబద్దాలని స్పష్టం చేశారు గంగూలీ. గతేడాది సెప్టెంబర్‌ టీ 20 కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకున్నాడు.

ఆ సమయంలో విరాట్‌ తో తాను మాట్లాడానని.. సారథ్యం నుంచి తప్పుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరినట్లు గంగూలీ తెలిపారు. అనంతరం వన్డే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్‌ కోహ్లీ… టీ 20 నుంచి వైదొలినప్పుడు తనతో ఎవరూ మాట్లాడలేదని.. దాదా ఎందుకు అలా చెప్పాడో తనకు తెలియదని మీడియాతో చెప్పాడు. అయితే.. విరాట్‌ కోహ్లీ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు గంగూలీకి కోపం తెప్పించాయని..దీంతో అతడికి షోకాజ్‌ నోటీసులు పంపించాలని అనుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గంగూలీ తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news