GHANI : ‘గని’ నుంచి బిగ్‌ అప్డేట్‌..ఐటెం సాంగ్‌ లో తమన్నా

-

మెగా హీరో వరుణ్ తేజ్.. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్… ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమాలో ”కొడితే” అంటూ సాగే ఐటెం సాంగ్‌ ను సంక్రాంతి రోజున 11.08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. అంతేకాదు.. ఈ సాంగ్‌ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు ఓ పోస్టర్‌ ను కూడా వదిలింది చిత్ర బృందం. కాగా.. వరుణ్‌ తేజ్‌ నటించిన ఈ గని సినిమా మార్చి 18 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version