God Father : నెట్ ఫ్లిక్స్ లో గాడ్ ఫాదర్.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

-

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా లూసీఫర్ రీమేక్ కు గా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా విడుదలై మంచి వసూల్లను రాబడుతోంది. ఇది ఇలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.

నవంబర్ 19వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏది రాలేదు. కానీ దాదాపు సినిమా విడుదలైన సమయంలో ఓటిటికి విధించిన ఎనిమిది వారాల గడువు పూర్తయిందని, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మెగాస్టార్ క్రేజ్ క్యాష్ చేసుకోవాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ భావిస్తోందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version