వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

-

కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీని తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి సమయం లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. వ్యాక్సిన్ కి వెళుతున్నప్పుడు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి….

రెండు మాస్కులు ధరించండి:

వ్యాక్సిన్ సెంటర్ దగ్గర ఎక్కువ మంది జనం ఉంటారు. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే రెండు మాస్కులు ధరించండి. లోపల N95 మాస్క్ వేసుకుని పైన సర్జికల్ మాస్క్ వేసుకోండి. దీని వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.

గ్లౌజులు వేసుకోండి:

వ్యాక్సిన్ సెంటర్ కి వెళ్లేటప్పుడు వివిధ ప్రదేశాలని ముట్టుకోవలసి వస్తుంది. ఆ తరువాత ముఖాన్ని, కళ్ళని, ముక్కుని ఇలా మనం ముట్టుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. కాబట్టి గ్లౌజులు వేసుకోవడం మంచిది. అదే విధంగా మీ ముఖాన్ని మీరు తాకకండి.

షేక్ హ్యాండ్ వద్దు:

మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ సెంటర్లో కనిపిస్తే వాళ్లకి షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు. అదే విధంగా హగ్ కూడా ఇవ్వకండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి.

శానిటైజర్ ని ఉపయోగించండి:

శానిటైజర్ ని గ్లౌజులు మీద కూడా వేసుకుని శుభ్రంగా ఉండండి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.

మాస్క్ ని ముట్టుకోకండి:

చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు పదేపదే మాస్క్ ని సర్దుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు ఆ మాస్క్ ఫిట్ కాలేదు అనిపిస్తే ముందే మార్చేయండి. అంతే కానీ బయటికి వెళ్ళినప్పుడు పదే పదే
మాస్క్ ని ముట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ సులువుగా సోకుతుంది.

కాబట్టి తప్పు చేయొద్దు. అదే విధంగా బయటికి వెళ్లినప్పుడు తినడం, తాగడం లాంటివి చేయకండి. ఇంట్లోనే మీరు తినేసి వెళ్లడం మంచిది. అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కులు తొలగించొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version