ఎడిట్ నోట్: బంగారు తెలంగాణ..బంగారు భారత్!

-

సేమ్ కాన్సెప్ట్…సేమ్ పాలిటిక్స్…బంగారు తెలంగాణ..బంగారు భారత్. మొన్నటివరకు తెలంగాణని బంగారు తెలంగాణ చేయగల సత్తా కేసీఆర్‌కే ఉండని ప్రచారం…ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌తో బంగారు భారత్ సాధ్యమని ప్రచారం. త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించడానికి..కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయం చేయడానికి రెడీ అయ్యారు.

ఇప్పటికే విపక్ష పార్టీ నేతలని కేసీఆర్ కలిశారు. ఇక ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టి..విపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని, ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి..మోదీని గద్దె దించాలని చూస్తున్నారు. సరే మోదీని గద్దె దించే విషయం పక్కన పెడితే..ముందు బంగారు తెలంగాణ..బంగారు భారత్ గురించి, కేసీఆర్ జాతీయ పార్టీ గురించి చెప్పుకోవాలి. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్ అధికారంలోకి వస్తే…బంగారు తెలంగాణ వస్తుందని తెగ ప్రచారం చేశారు. మరి కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు…మరి తెలంగాణ…బంగారు తెలంగాణ అయిందా? అంటే ఈ విషయం ప్రజల్ని అడిగితే బెటర్.

ఎందుకంటే  తెలంగాణ వచ్చాక కాస్త మార్పులు వచ్చాయి..కానీ ప్రజలు అనుకున్న స్థాయిలో పరిపాలన మాత్రం జరగలేదని చెప్పొచ్చు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులకు న్యాయం జరగడలేదు…హైదరాబాద్‌ని పక్కన పెడితే..రూరల్ ఏరియాల్లో పెద్దగా అభివృద్ధి జరగలేదు. రైతులకు కూడా సరైన న్యాయం జరగలేదు. అలాగే ఈ ఎనిమిదేళ్లు కేసీఆర్ ఇచ్చిన హామీలు..పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అలాగే అన్నీ వర్గాలకు పూర్తి న్యాయం జరగలేదు. ఇంకా చాలా ఉన్నాయి…అలాంటప్పుడు బంగారు తెలంగాణ ఎక్కడ అయింది…ఏదో టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం బంగారం అయినట్లున్నారు.

ఇక రాష్ట్రాన్నే బంగారు తెలంగాణ చేయలేదు…మరి దేశాన్ని బంగారు భారత్ చేయడానికి కేసీఆర్ వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు భజన మొదలుపెట్టారు. 33 జిల్లా అధ్యక్షులు…కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారు. పైగా కేసీఆర్‌ని దేశం కోరుకుంటుందని మాట్లాడుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని, అన్నీ రాష్ట్రాల్లో గులాబీ జెండా ఎగరవేయాలని, తెలంగాణ ప్రగతి నమూనా దేశమంతటికీ విస్తరించాలని, బంగారు భారత్‌గా మారాలని 33 జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు చెప్పుకొచ్చారు.

ఇక ఇందులో కేసీఆర్‌కు డప్పు కొట్టడం తప్పితే మరొకటి లేదు…జాతీయ పార్టీ పెట్టి దాన్ని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు..తెలంగాణలోనే నెక్స్ట్ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్తితి…మరి అలాంటప్పుడు దేశంలో గులాబీ జెండా ఎగరాలని కోరుకోవడం అతిశయోక్తి అవుతుంది. ఇక రాష్ట్రమే బంగారు తెలంగాణ అవ్వలేదు…మరి దేశం బంగారు భారత్ ఎలా అవుతుందో. మరి చూడాలి కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయో.

Read more RELATED
Recommended to you

Latest news