యాంకరింగ్ కు గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన సుమ..!

-

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు సుమ కనకాల.. కేరళ ముద్దుగుమ్మ అయినా.. ఈమె ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ను వివాహం చేసుకొని.. తెలుగు పరిశ్రమలోనే స్థిరపడిపోయింది. గతంలో సినిమాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపైకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. మకుటం లేని మహారాణిగా దూసుకుపోతోంది.. బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుమా కనకాల అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈమె యాంకరింగ్ ను ఇష్టపడతారు.. అంతేకాదు చిరంజీవిని మొదలుకొని అల్లు అర్జున్ వరకు చాలామంది తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా ఈమెనే ఆహ్వానిస్తూ ఉంటారు.

దీన్ని బట్టి చూస్తే ఈమె ఎంత పాపులారిటీ దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా సుమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది.. సుమా యాంకరింగ్ కి బ్రేక్ ఇవ్వబోతోంది అని వార్తలు రాగా తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది సుమ. డిసెంబర్ 31 సందర్భంగా ఈటీవీలో ప్రసారం కాబోయే వేర్ ఈస్ ద పార్టీ కార్యక్రమానికి సుమా హోస్టుగా వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో కొద్ది రోజులు యాంకరింగ్ కు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతూ ఎమోషనల్ అయింది.. దాంతో సుమ యాంకరింగ్ మానేస్తున్నట్టు మీడియాలో వార్తలు కోడై చూశాయి.

ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత సుమా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు ఈమెకు కాల్ చేసి నిజమేనా అని ఆరా తీయడం ప్రారంభించారు.. దీంతో ఆమె సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ తానే స్వయంగా క్లారిటీ ఇచ్చింది.. సుమ మాట్లాడుతూ..” రీసెంట్గా న్యూ ఇయర్ ఈవెంట్ చేసాము.. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేసాము.. అది ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. నిజానికి ఆ ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తవమే.. కానీ మొత్తం ఈవెంట్ అంతా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది.. అప్పటివరకు కంగారు పడకండి. నేను టీవీ కోసమే పుట్టాను.. ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టాను.. నేను ఎటు వెళ్లడం లేదు.. కాబట్టి మీరందరూ కంగారు పడకండి హాయిగా హ్యాపీగా ఉండండి.. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ” అంటూ మెసేజ్ పెట్టి క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version