గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తి చేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పేస్కేలు)ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే.. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, పీఎఫ్, జీఎల్ఐ, లీవ్ ఎన్క్యాష్మెంట్ తదితరాలన్నీ కూడా ఏప్రిల్ నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు.