వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే ఒక వారం ముందుగానే కేరళను తాకే అవకాశం ఉన్నదని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు ఈ నెల 15వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
దీంతో అండమాన్ నికోబార్ దీవుల్లో తొలి వర్షాలు కురవచ్చని వెల్లడించారు అధికారులు. ఈ నేపథ్యంలో రుతుపవనాలు ఈ సారి కేరళకు ముందుగానే వచ్చే అవకాశం ఉదని చెప్పారు. జూన్ 5 నుంచి 8 మధ్య తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించవచ్చని తెలిపారు. కాగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురు స్తాయని అంచనా వేస్తున్నారుతొలి అధికారులు.