సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ వేడుకకు ఫ్రీ ఎంట్రీ!

-

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు -2. భారతీయుడు’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ జులై 12న తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

తాజాగా మూవీ ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 7న హైదరాబాద్లోని N కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ ఈవెంట్ కి ఫ్రీ ఎంట్రీని చిత్ర యూనిట్ కల్పిస్తుంది.కాగా, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, స‌ముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version