ఈరోజుల్లో డబ్బులు అవసరం అయితే పక్క వాళ్ళను అడిగేవారు లేరు.. లోన్ తీసుకొని అవసరాలకు వాడుతున్నారు. ఇకపోతే బ్యాంకులతో పనిలేకుండా ఇంట్లో కూర్చొనే లోన్ పొందే అవకాశం ఉంది.. అదేలానో ఇప్పుడు చూద్దాం.. లైన్ ద్వారా మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఫోన్ పే ద్వారా కూడా మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫోన్‌పే తన వినియోగదారుల కోసం ఈ ఫోన్ పే ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఫోన్ పే డైరెక్టుగా రుణాలు ఇవ్వదు. ఇది ఇతర సంస్థలతో భాగస్వామ్యం ద్వారా రుణ సదుపాయాన్ని అందిస్తోది. మనీ వ్యూ, బడ్డీలోన్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఫోన్ పే. తన ఫ్లాట్ ఫాం ద్వారా ఈ పిన్ టెక్ సంస్థలను ప్రమోట్ చేస్తోంది. సో మీరు ఫోన్ పే ద్వారా మనీ వ్యూ, బడ్డీ లోన్ నుంచి లోన్ ను పొందవచ్చు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఇందుకోసం.. మీరు ముందుగా ఫోన్ పే యాప్ లోకి వెళ్లాలి. అక్కడ మీకు పైన బ్యానర్ లో మనీ వ్యూ లేదా బడ్డీ లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వీటిలో మీకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. సెలక్ట్ చేసుకుని దానిపై క్లిక్ చేస్తే చాలు. ఇప్పుడు న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు బడ్డి లోన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాత యాప్ లోకి లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పాన్ కార్డు నెంబర్, జాబ్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత మీకు లోన్ అర్హత ఉందా లేదా అనేది తెలుస్తుంది. మీకు ఎలిజిబిలిటీ లేకుంటే లోన్ రాదు. ఎలిజిబిలిటి ఉంటే వెంటనే రూ.5లక్షలు లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది..సిబిల్ స్కోర్ బాగుంటే వెంటనే రుణం పొందవచ్చు. లేదంటే ఈ లోన్ రావడం కష్టం అవుతుంది.. ఇది గుర్తుంచుకోండి..