తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు శుభవార్త..ఉచిత రేషన్‌పై కీలక నిర్ణయం

-

తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్‌. ఉచిత రేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా కేంద్రం ప్రకటించిన సంవత్సరకాలం ఉచిత రేషన్ అందించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ జనవరి నుంచి వచ్చే డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

జాతీయ ఆహార భద్రత చట్టం కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. అంత్యోదయ కార్డులకు కుటుంబానికి 35 కేజీలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోలు ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా కొమరం భీమ్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, అదిలాబాద్ జిల్లాలకు బియ్యానికి బదులుగా 45 రైస్ ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహాభద్రత కార్డులు ఉన్న వారి విషయంలో ఉచిత రేషన్ గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version