ఉద్యోగులకు గుడ్ న్యూస్..జూలై లో జీతం ఎంత వస్తుందో తెలుసా?

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..గత కొద్ది రోజులుగా ఏడో వేతన సంఘం సిఫారసు గురించి చర్చలు జరుగుతున్నాయి.. ఉద్యోగుల జీతాల పెంపు పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.జీతాలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.జులైలో 9.3 శాతం డీఏ పెరగనుంది. 1 జులై 2022 నుంచి డీఏ పెంపు 9.3 శాతం పెరగనుంది.డీఏ 9.3 శాతం పెరిగితే ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతం పెరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు రేటు 391 శాతంగా ఉంటుందని కేంద్రం వెల్లడించింది.

జూలై 1 నుంచి ఎగ్జిక్యూటివ్స్, సీపీఎస్ఈ ఉద్యోగులకు 391 శాతం డీఏను పెంచనున్నారు. సీపీఎస్ఈ క్యాటగిరీలో ఎగ్జిక్యూటివ్స్, నాన్ యూనియన్ సూపర్ వైజర్స్ కు జులై 1 నుంచి 391 శాతం డియర్ నెస్ అలవెన్స్ ను అందించనున్నారు. 1997 రివైజ్ డ్ పే స్కేల్ ప్రకారం ఐడీఏ ఉద్యోగులకు 391 శాతం అందించనున్నారు.

ఇవన్నీ కూడా ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణంగా డీఏ పెంపు ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో జరుగుతుంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏ పెంపును కేంద్రం నిర్ణయిస్తుంది. జనవరికి సంబంధించిన డీఏను మార్చిలో పెంచింది కేంద్రం. జులైలో పెరగాల్సిన డీఏను పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది..ఈ నెల నుంచి పెరిగిన జీతాలు, డీఏ పెంపు కలిపి వచ్చే నెల నుంచి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version