గుడ్‌న్యూస్‌.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

-

నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి కబురు చెప్పింది.. రాబోయే ఐదేళ్లలో 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. భారత వృద్ధిలో కీలక భాగస్వాములం అవుతామని వెల్లడించింది. 2028 నాటికి తమ ఉద్యోగుల సంఖ్యను 80,000కు పెంచుకుంటామని పేర్కొంది..

పీఎడబ్ల్యూసీ అమెరికా, పీడబ్ల్యూసీ ఇండియా సంయుక్తంగా భారత్‌లో ఒక కొత్త జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చెయ్యనున్నారు.. ఇప్పటికే ఉన్న కంపెనీలు మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు దృష్టి సారిస్తామని తెలిపాయి. ప్రస్తుతం ఇక్కడ కంపెనీకి 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారంతా కూడా స్థానికంగా, అంతర్జాతీయ డెలివరీ కేంద్రాల్లో పనిచేస్తున్నారు.

‘పీఎడబ్ల్యూసీ అమెరికా, పీఎడబ్ల్యూసీ ఇండియా భాగస్వామ్యం వల్ల మా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఈ చర్య వృద్ధికి దోహద పడుతుంది. మా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు తోడ్పాటునందిస్తుంది. అలాగే మా సాంకేతికత అభివృద్ధి చెందుతుంది’ అని పీడబ్ల్యూసీ యూఎస్‌ ఛైర్మన్‌, సీనియర్‌ పార్ట్‌నర్‌ టిమ్‌ రియాన్‌ అన్నారు..ఇండియా మార్కెట్‌ సామర్థ్యాన్ని ఒడిసిపడతామని పీడబ్ల్యూసీ తెలిపింది. భారత్‌ అభివృద్ధితో భాగస్వాములు అవుతామని ప్రకటించింది. 2021లో ఆరంభించిన అంతర్జాతీయ వ్యూహాత్మక సరికొత్త సమీకరణంలో భాగంగా దీన్ని చేపడుతోంది. భారత దేశ అభివృద్ధిలో మేం మా వంతు పాత్ర పోషిస్తూ..ముఖ్య సమస్యలకు పరిష్కారం అందించేందుకు క్లయింట్లతో సన్నిహితంగా పనిచేస్తాం.. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే వేదికలను సృష్టిస్తాం. ఈ దిశలో మేం వేస్తున్న ఓ ముందడుగే ఈ సరికొత్త జాయింట్‌వెంచర్’ అని పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్‌పర్సన్‌ సంజీవ్‌ కిషన్‌ పేర్కొన్నారు.. ఈ న్యూస్ ఇప్పుడు యువతకు మరో కొత్త ఆశను కలిగిస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version