అందుకే అస్సాం సీఎం.. మైక్ లాక్కొని అడ్డుకున్నా – నందు బిలాల్

-

అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా మైక్‌ లాక్కొవడంపై టిఆర్ఎస్ నేత నందు బిలాల్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే.. ఖబర్దార్ అని హెచ్చరించారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా.. గణేష్ ఉత్సవాల కు వచ్చారు… ధర్మ కార్యక్రమానికి వచ్చిన అస్సాం సీఎం.. రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదని మండిపడ్డారు.

మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషించారు.. దీంతో మేం మైక్ లాక్కొని అడ్డుకున్నామని స్పష్టం చేశారు. మా నిరసన వ్యక్తం చేసామని.. గణేష్ శోభయాత్ర కు వచ్చిన సీఎం..శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే.. మేం ఉరుకోబోమని..ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని జరగనివ్వండన్నారు. మరోసారి బిజెపి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై అనుచిత వాఖ్యలు చేస్తే ఖబర్దార్..అని వార్నింగ్‌ ఇచ్చారు టిఆర్ఎస్ నేత నందు బిలాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version