ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 39 వేల పోస్టుల భర్తీపై సర్కార్‌ ప్రకటన

-

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూ.. అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు 3,946 పోస్టులు భర్తీ చేసింది సర్కార్‌. 1,237 పోస్టులకు కొత్తగా ఇటీవలే నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక త్వరలో మరో 458 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది సర్కార్‌.

CM Jagan Mohan Reddy

అలాగే… వైద్య శాఖ లో ఏకంగా 39 వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు చేపట్టింది జగన్‌ సర్కార్‌. ఈ పోస్టుల నోటిఫికేషన్‌ ఫిబ్రవరి చివర్లో వచ్చే ఛాన్స్‌ ఉంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్‌ కూడా ప్రకటన చేశారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక 6,03,756 పోస్టులను భర్తీ చేసింది. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1,84,264 ఉండగా కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు 3,99,791 భర్తీ చేశారు. వీటిలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1,21,518 మందికి ఉద్యోగాలిచ్చింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా ప్రకటనతో నిరుద్యోగులు అలర్ట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version