ఆడపిల్లల విద్యకి అయ్యే ఖర్చంతా ప్రభుత్వానిదే.. ఈ స్కీమ్ వివరాలు మీకోసం..!

-

కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో బాలికా సమృద్ధి యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ తో చాలా మంది ప్రయోజనాలని పొందుతున్నారు. బాలికా సమృద్ధి యోజన స్కీమ్ తో ఆడపిల్లల విద్యకు అయ్యే ఖర్చును అంతా కూడా భరిస్తోంది.

ఈ స్కీమ్ ని 1997 అక్టోబర్ 2న కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న బాలికలు ఈ స్కీమ్ కి అర్హులే. కుమార్తెల ఉజ్వల భవిష్యత్తు కోసం దీన్ని స్టార్ట్ చేసారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వారు ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందొచ్చు. ఇక ఎవరు దీనికి అర్హులన్నది చూస్తే.. 15 ఆగస్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలు మాత్రమే దీనికి అర్హులు.

ఒక వేళ కనుక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆ ఇద్దరు కూడా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. అలానే ఆడపిల్లకు జన్మనిచ్చిన సమయం లో తల్లికి రూ.500 ఆర్థిక సహాయం ఇస్తారు. స్కాలర్‌షిప్ సౌకర్యం కూడా లభిస్తుంది. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందొచ్చు. వాళ్ళు పెద్దవారైన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ స్కీమ్ కింద ఎంత స్కాలర్‌షిప్ వస్తుందనేది చూస్తే.. 1-3వ తరగతి వరకు ఏడాదికి రూ.300 , 4వ తరగతి వారికి రూ.500…. ఐదో తరగతిలో వాళ్లకి రూ.600 వస్తాయి. 6-7 తరగతులకు రూ.700 వస్తాయి. అదే 8లోఉంటే రూ.800 అందుతాయి. 9-10 తరగతిలో ఆడపిల్లకు రూ.1000 స్కాలర్‌షిప్ ఇస్తారు. 10వ తరగతి తర్వాత ఉన్నత విద్య కి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వానిదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version