పెళ్లైన రెండో రోజే పోయిన ప్రభుత్వ ఉద్యోగం..? కారణం ఏంటంటే..

-

ఈరోజుల్లో..ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే.. ముఖ్యంగా చూసేది.. అబ్బాయి ఏ జాబ్ చేస్తున్నాడు, ఆస్తి ఏంత అని.. ప్రైవేట్‌ జాబ్‌కు లక్షల జీతం వచ్చినా కొంతమందికి నచ్చదు.. చిన్నదైనా గవర్నమెంట్‌ జాబ్‌ ఉన్న అబ్బాయికే ఇవ్వాలని చూస్తారు. అలా ఉంది డిమాండ్‌.. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ విహార్‌కు చెందిన ఓ కుటుంబం కూడా ఇదే కోరుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాడితో కూతురు పెళ్లి నిశ్చయించాడు. సర్కారు జాబ్‌ ఉన్న అబ్బాయితో కూతురు పెళ్లంటే.. ఆ కుటుంబ ఆనందం అంతా ఇంతా కాదు.. ఘనంగా పెళ్లి చేశారు.. కానీ..ట్విస్ట్‌ ఏంటంటే.. పెళ్లైనా రెండో రోజే.. అబ్బాయి జాబ్‌ పోయింది..

వరుడి పేరు ప్రణవ్ రాయ్. అతను 2017 నుండి జల్పైగురిలోని రాజ్‌దంగా కెండా మహమ్మద్ హైస్కూల్‌లో పనిచేస్తున్నాడు. ఇది చూసిన అమ్మాయి కుటుంబం ఆమె కుమార్తెకు ఆ అబ్బాయితో వివాహం చేయాలని నిర్ణయించుకుంది. ఇరు కుటుంబాలు చాలా సంతోషించాయి. గత గురువారం వీరిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ప్రణవ్ శుక్రవారం తన భార్యతో ఇంటికి తిరిగి వచ్చాడు, అయితే అదే రోజు కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 842 ఉపాధ్యాయుల నియామకాన్ని చట్టవిరుద్ధమని రద్దు చేస్తూ ఆదేశించింది. జాబితా ప్రకటించినప్పుడు ప్రణవ్ రాయ్ పేరు కూడా ఉంది. ఉద్యోగం పోయిందన్న వార్త తెలియగానే ఇంట్లో శోకసంద్రం వ్యాపించింది.

ఊర్లో వాళ్లు తలాఓమాట అనడం మొదలుపెట్టారు.. పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో కుంభకోణం జరిగిన సంగతి విదితమే..డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇచ్చారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. ఆ తర్వాత హైకోర్టు అన్ని నియామకాలను రద్దు చేసింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లోని 57, 785 మొత్తం 842 మంది నియామకాలను రద్దు చేయాలని నోటిఫై చేయబడింది. వారెవరూ పాఠశాలలో ప్రవేశించడానికి వీల్లేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకూ వారికి ఇచ్చిన జీతం వాపసు అంశంపై ఈ కోర్టు తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. గ్రూప్ సి కేసుల్లో సిఫార్సు చేసిన ఎంత మంది వ్యక్తులు ఓఎంఆర్‌ని ట్యాంపరింగ్ చేశారని కోర్టు ప్రశ్నించింది. ఇదంతా అటుుంచి.. ఇప్పుడు గవర్నమెంట్‌ జాబ్‌ అని పిల్లను ఇచ్చిన ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో..?

Read more RELATED
Recommended to you

Exit mobile version