గృహప్రవేశం చేసేటప్పుడు ఆవుల్ని ఎందుకు ఇంట్లోకి తీసుకు వస్తారంటే..?

-

కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేస్తారు. గృహప్రవేశం చేసినప్పుడు పూజలు చేయడం, ఇంట్లోకి ఆవుల్ని తీసుకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంటికి ఎందుకు ఆవుల్ని తీసుకు వెళ్లాలి..? ఎందుకు అందరు ఇలా చేస్తూ వుంటారు..? ఎప్పుడైనా మీకు ఈ అనుమానం కలిగిందా..? అయితే మరి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఆవుల్ని ఎందుకు తీసుకు వెళ్తారు అనేది చూద్దాం.

కొత్త ఇల్లు కట్టుకున్నాక గృహ ప్రవేశం సమయంలో చాలా మంది ఆవుల్ని తీసుకుని వెళతారు. దీనికి గల కారణం ఏమిటంటే..? ఆవులకు దుష్ట శక్తుల్ని కనిపెట్టే తత్వం ఉంటుంది. అందుకనే ప్రతి మూల ఆవు ని తీసుకు వెళ్లి తిప్పుతారు.

ఒకవేళ దుష్ట శక్తి ఉంటే ఆవు భయపడి బయటికి వచ్చేస్తుంది. ఒకవేళ కనుక ఎలాంటి దుష్టశక్తి లేదు అంటే ఆవు లోపలికి వెళుతుంది. పైగా దేవతలుగా ఆవును పూజిస్తారు. ఒక ఆవుని తీసుకు వెళ్తే హిందూ దేవతలను అందరినీ తమ ఇళ్లల్లో కి తీసుకు వెళ్లినట్లు నమ్ముతారు.

పైగా గోమాతను శుభసూచకంగా హిందూ ప్రజలు నమ్ముతారు. అలానే గోవును దైవంగా భావించి పూజలు చేస్తారు. ఇలా తీసుకు వెళ్తే శుభం కలుగుతుందని, మంచి జరుగుతుందని గృహ ప్రవేశం సమయంలో ఆవుల్ని తీసుకుని వెళ్లడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version