ఏపీ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. 2018 నుంచి ఫలితాల విడుదలలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి.పరీక్షల నిర్వహణ కోసం టెక్నాలజీని వినియోగించామన్నారు.. డిజిటల్ పద్దతిలో మూల్యాంకనం చేశాం…వచ్చే నెలలనే గ్రూపు , గ్రూప్ 2 నోటిఫికషన్లు జారీ చేస్తామని ప్రకటన చేశారు. ఏపీపీఎస్సీ అభ్యర్థులు లేవనెత్తిన అంశాలపై అన్ని అంశాలపై కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళాం….అభ్యర్థులు గవర్నరుకు ఫిర్యాదు చేశారన్నారు.
రాజ్ భవన్ నుంచి ఎపీపీఎస్సీని వివరణ కోరింది…పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు అన్ని అంశాలను గవర్నర్ కు వివరించామని చెప్పారు. అభ్యర్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.పూర్తి పారదర్శకంగానే మూల్యాంకనం జరిగింది.పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీపీఎస్సీ యువతకు స్పష్టమైన హామీ ఇస్తుందన్నారు.రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ద్వారా మరో 2 వేల పోస్టులను భర్తీ చేయబోతున్నామని తెలుగు ప్రకటన చేశారు.