ట్రైన్ టికెట్స్ ని క్యాన్సిల్ చేస్తుంటారా..? క్యాన్సిలేషన్ ఇప్పుడు మరింత భారం..!

-

మనం ట్రైన్ టికెట్ ని బుక్ చేసి ఒక్కోసారి దాన్ని క్యాన్సల్ చేస్తూ ఉంటాం. మన ప్రయాణాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. అయితే కన్‌ఫామ్ అయిన రైల్వే టిక్కెట్‌ను క్యాన్సిల్ చేస్తే ఇండియన్ రైల్వేస్ బాదుడు మొదలు పెట్టింది. పూర్తి వివరాల లోకి వెళితే… ఇండియన్ రైల్వేస్ క్యాన్సిలేషన్ ఛార్జీల నిబంధనలను మార్చింది. రైల్వే టిక్కెట్‌ను క్యాన్సిల్ చేస్తే ఇక ఎక్కువ చార్జెస్ కట్ అవుతాయి. కనుక జాగ్రత్తగా వుండండి.

Indian-Railways

టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలపై ఇక మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ట్యాక్స్ రీసెర్చ్ యూనిట్ సర్క్యులర్ ని జారీ చేసింది. అందులో ఈ విషయం వుంది. ఒకవేళ మీరు ఏసీ కోచ్ లేదా ఫస్ట్ క్లాస్ టిక్కెట్‌ను క్యాన్సల్ చేసినట్టయితే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందని చెప్పారు.

టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుంటే జీఎస్టీని చెల్లించాలని భారతీయ రైల్వే విభాగం కూడా చెప్పింది. ఇక చార్జెస్ ఎంత అనేది చూస్తే.. ఏసీ ఫస్ట్ క్లాస్‌ కి రూ.240, ఏసీ టైర్ 2కి రూ.200, ఏసీ టైర్3కి రూ.180ను కట్టాలి.

అలానే స్లీపర్ క్లాస్‌కి రూ.120ను, సెకండ్ క్లాస్ టిక్కెట్‌పై రూ.60ను క్యాన్సిలేషన్ ఛార్జీలు పే చెయ్యాల్సి వుంది. అలానే మీరు ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 12 గంటల్లోగా క్యాన్సిల్ చేసుకుంటే టిక్కెట్‌పై 25 శాతం ఛార్జ్ కట్టాలి. 4 గంటలప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 50 శాతాన్ని క్యాన్సిలేషన్ ఛార్జీలుగా కట్టాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version