దళిత బంధు పథకంతో సరికొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పించింది కెసిఆర్ ప్రభుత్వం. దళిత బంధు పథకం ద్వారా 9 డాగ్ గ్రూమింగ్ మొబైల్ వాహనాలను లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర, ఆర్ధిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు పూర్తిగా అధ్యయనం చేసి డాగ్ గ్రూమింగ్ వాహనాలు దళిత బంధు ద్వారా లబ్దిదారులకు సమకూర్చారు. తెలంగాణలో దళితులు ఆర్థికంగా ఎదుగలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు దళిత బంధు ప్రారంభించారు.
సీఎం గారి ముందు చూపు తో ఈరోజు మంచి ఫలితాలు కనపడుతున్నాయి. పెట్స్ కి అందించే డాగ్ గ్రూమింగ్ ద్వారా నెలకు 30 నుండి 40 వేలు సంపాదించుకోవచ్చు. దీంట్లో లబ్ధిదారులకు శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. దళిత బంధు గొప్పతనం ఏంటి అంటే తెలంగాణ లో ఎక్కడైనా మనకు వచ్చిన మనం మెచ్చిన పని చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ బిజినెస్ చేసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నుండి వచ్చి లబ్దిదారులు హైదరాబాద్ లో పెట్ గ్రూమింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. దళిత బంధు అర్హులు అందరూ ఉపయోగించుకొని కెసిఆర్ గారి కలను సాకారం చేయాలి. దానికి ప్రజా ప్రతినిధులు అందరం సహకరిస్తామని మంత్రి హరీష్ రావు గారు పేర్కొన్నారు.