తెలంగాణ ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్సై మరియు కానిస్టేబుల్ నియామకాలకు నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణులు అయిన రెండు లక్షల 37 వేల మంది పార్టు 2 కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే ఈ దరఖాస్తులలో తప్పిదాలు దొర్లాయని, అలాగే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయితే దీనిపై తాజాగా టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ శ్రీనివాసరావు స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు శ్రీనివాసరావు. దరఖాస్తుల సవరణకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో లేదా అంతకుముందు ఛాన్స్ ఇస్తామని వివరించారు. అభ్యర్థులు దీనిపై గందరగోళానికి గురికాకూడదని సూచించారు. ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.