BREAKING NEWS: సిద్ధిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాల్పుల కలకలం… కాల్పులు జరిపి డబ్బులతో పరారైన దుండగులు

-

సిద్ధిపేటలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సిద్ధిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాల్పులు జరిగాయి. రిజిస్ట్రేషన్ కు వచ్చిన వ్యక్తి నుంచి డబ్బులు లాక్కుని దుండగులు పరారయ్యారు. పాత ధరలతో రిజిస్ట్రేషన్ కు ఇదే చివరి రోజు కావడంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారు. ఈ క్రమంలోనే దుండగులు కాల్పులు జరిపి డబ్బులతో పరారయ్యారని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రిజిస్ట్రేషన్ కు వచ్చిన నర్సయ్య అనే వ్యక్తి డ్రైవర్ పై దుండగులు కాల్పులు జరిపి సుమారుగా రూ. 43.5 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. మాస్కులు ధరించి దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో డ్రైవర్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. కాగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దుండగుల కోసం వెతుకుతున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు గతంలో రిజిస్ట్రేషన్ చేయించదలిచిన భూమిపై గొడవలేమైనా ఉన్నయా.? అని విచారణ జరుపుతున్నారు. భూమి కొనుగోలుదారులు, అమ్మకందారులను పోలీసులు విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version