అమెరికాలో కాల్పుల కలకలం…పది మంది మృతి !

Join Our Community
follow manalokam on social media

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారని తెలుస్తోంది. నిన్న కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఓ సూపర్‌ మర్కెట్‌లోకి చొరబడి అక్కడి కస్టమర్ ల మీద కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పోలీసు అధికారి సహా పది మంది మృతి చెందారు. ఈ కాల్పులతో భయాందోళనకు గురైన స్టోర్‌లోని వినియోగదారులు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

పోలీసుల  వివరాల ప్రకారం.. ‘‘బౌల్డర్‌లోని కింగ్‌ సూపర్‌ మార్కెట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడని నిన్న మధ్యాహ్నం 2.30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారి సహా మొత్తం పది మంది మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి గల కారణాలేంటి విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మొన్న ఈ మధుయ అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై దుండగులు కాల్పులకు పాల్పడటం సంచలనం సృష్టించింది. 

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...