గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో కారులో వెళ్తున్న రిషీ, వసూ..రెస్టారెంట్ కి వెళ్లటం లేదా అంటే.. ఎగ్జామ్స్ అయ్యే వరకూ డ్యూటీకి రాను అని చెప్పాను అంటుంది. ఎగ్జామ్స్ అయ్యాక..హ్యాపీగా సెలవులు గడిపేద్దాం అనుకోకు..మనకు మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ వుంది అంటే..అవును సార్, జగతి మేడమ్ కూడా అదే చెప్పారు అంటుంది వసూ. రిషీ మనసులో నేను చెప్తున్నాను కదా, మధ్యలో ఆవిడ టాపిక్ తీయటం ఎందుకో అనుకుంటాడు. ఇంతలో రోడ్డుపక్కన మిర్చీబజ్జీల స్మెల్ వస్తుందని..సార్ సార్ కారు ఆపండి అని ఓ పిలస్తుంది. రిషీకి ఏం వాసన రాదు. వసూ మిర్చీబజ్జీ గురించి చెప్తూ..కారు వెనక్కు తీసుకెళ్లరా తిందాం అంటుంది. రిషీ మొదట ఒప్పుకోడు..వసూ ఎలాగోలా ఒప్పిస్తుంది. బండిదగ్గరకు వెళ్తారు. రిషీ ఆగు ఆగు అంటున్నా..వసూ కారు దిగుతుంది. ఏంటి సార్ మీరు..మిర్చీ తినటానికి కూడా బతిమిలాడించుకుంటారు, కావాలంటే డబ్బులు నేను ఇస్తాను అంటుంది వసూ. ఇప్పుడు డబ్బులు గురించి ఎవరు తీశారు..వస్తాను కానీ ఒక కండీషన్ అని..నువ్వు గతంలో ఆ మొక్కజొన్న కంకులు కాల్చినట్లు చేయకుండా ఉంటానంటే వస్తాను అంటాడు. మొత్తానికి రిషీని ఒప్పించి మిర్చీబండి దగ్గరకు తీసుకెళ్తుంది. కామెడీ ఏంటంటే..వసూ కారులోంచి ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా..ఆ బ్యాగ్ వదలదు. కారులో వేసి రావొచ్చుగా. రెండు ప్లేట్స్ మిర్చీ చెప్తుంది. రిషీకి సిగ్గేస్తుంది. కారులో కుర్చోని తిందాం అంటే..వసూ ఇక్కడ తింటేనే న్యాచురల్ గా ఉంటుంది అని మిర్చీలో ముందు ఈ కొస కొరకాలి అని తిని చూపిస్తుంది. రిషీని తినండి తినండి అంటుంది. రిషీ మిరపకాయను వదిలేసి తినబోతాడు. వసూ ఊరుకోదుగా..అలా తినకోడదు అని పెద్ద స్టోరి చెప్పబోతుంది. అలా మిర్చీబజ్జీల గురించి వసూ చెప్తుంటే..ప్రేక్షకులకు కూడా తినాలనిపిస్తుంది. వసుధార నీకు ముందే చెప్పాను..ఇదంతా చెప్పొద్దని ఎలాఅయితే తింటాడు. తిని హ్యాండ్ వాష్ చేసుకుని టిష్యూపేపర్స్ అడుగుతాడు. వసూ సార్ ఇక్కడ అవన్నీ ఉండవు అని చున్నీ ఇస్తుంది.
తరువాయిభాగంలో..రిషీ కారు ఫణీంద్రకు ఇవ్వడంతో..అనుకోని పరిస్థితుల్లో జగతి, రిషీ ఒకే కారులో వస్తారు. అది చూసిన వసూ, మహేంద్ర చూసి నేను చూస్తున్నది నిజమేనా అనుకుంటారు. అదే సార్ నాకు అర్థంకావటం లేదు అనుకుంటారు.