నవీన్ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పిన హరిహర కృష్ణ తండ్రి

-

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్రైమ్ లవ్ స్టోరీ లో నింధితుడు హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్ నవీన్ కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలిపారు. ప్రేయసి కోసం స్నేహితుడిని చంపిన హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. అమ్మాయి ట్రాప్ లో పడి ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయని అన్నారు. ఒకరు చనిపోతే మరొకరు జైల్ పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

హరిహర కృష్ణ శివరాత్రి పండుగ రోజున వరంగల్ కు వచ్చాడని.. ఆరోజు హరిహరకృష్ణ కి ఎక్కువ ఫోన్లు వచ్చాయన్నారు. ఏదో అలజడిగా ఉన్న తీరు గుర్తించి ఏం జరిగిందంటే.. ఏమీ లేదు అంటూ వరంగల్ నుండి హైదరాబాద్ కు వెళ్ళిపోయాడన్నారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాలేదన్నారు. అప్పటికే నవీన్ కనపడట్లేదని మిస్సింగ్ కేసు నమోదు అయిందన్నారు ప్రభాకర్. ఈ అబ్బాయి కూడా కనపడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. హరిహర కృష్ణ మళ్ళీ 23వ తారీకు వరంగల్ వచ్చాడని.. ఆరోజు ఏం జరిగిందని నిలదీస్తే నవీన్ కి హరిహర కృష్ణ మధ్య గొడవ జరిగినట్టు చెప్పాడన్నారు.

ఈ గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని సూచించారని తెలిపారు. మట్టెవాడ పోలీసుల దగ్గరికి తీసుకెళ్దామంటే రేపు హైదరాబాదులోనే పోలీసులకు లొంగిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడన్నారు. నిన్న హైదరాబాదులో పోలీసుల దగ్గర లొంగిపోయాడని.. తప్పు చేసింది ఎవరైనా తప్పు తప్పే అన్నారు ప్రభాకర్. అమ్మాయిల ట్రాప్ లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. నవీన్ కుటుంబ సభ్యులను క్షమించమని వేడుకుంటున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version