దళితబంధు అమలు కాకపోతే పేరు మార్చుకుంటా : హరీష్ రావు

-

దళితబంధు అమలు కాకపోతే తన పేరు మార్చుకుంటానని.. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ సింగాపురం ఎన్నికల ప్రచారంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ… బీజేపీ , ఈటల రాజేందర్ హుజూరాబాద్ కు ఎం చేసిండ్రు అని అడుగుతున్నాని… అబద్దాల బీజేపీ మాటలు నమ్మవద్దని కోరారు.

బీజేపీ గెల్చేదిలేదు. ప్రభుత్వం వచ్చేది లేదు. మంత్రి అయ్యేది లేదని ఫైర్‌ అయ్యారు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా నడుస్తుందని… ధరలుపెంచిన బీజేపీ మనకు ఎందుకు ? అని ప్రశ్నించారు. ఆసరా ఇస్తున్నామా లేదా, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నమా లేదా ? అని పేర్కొన్నారు. ”ఇవి కడుపు నింపవని రాజేందర్ అన్నడు, కేఆసీర్ కిట్ పనికి రాదట… రైతుంబంధు డండగ అట. ఆసరా పెన్షన్ పరిగ ఎరుకున్నట్లు అట” అంటూ హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. 30 తేదీని ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version