గవర్నర్ కు లేని ఇబ్బంది…బిజేపి నేతలకు ఎందుకు ? అని మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని… ఏం మాట్లాడాలో తెలియక.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. గవర్నర్ మహిళా కదా అందుకే సభకు పిలవడం లేదంటుంది బీజేపీ అని.. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలతో మహిళా లోకాన్ని అవమనించారని ఫైర్ అయ్యారు.
అస్సాం సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్ధించారని.. మమత బెనర్జీ మహిళా సీఎం నీ బీజేపీ గవర్నర్ ని అడ్డం పెట్టుకొని వేధించడం లేదా .? అని నిలదీశారు. గవర్నర్ ను అవమానించే ఉద్దేశం మాకు లేదని.. భేటీ బచావో పథకం కి ప్రభుత్వం కేటాయించిన నిధులు 80 శాతం మోడీ ప్రచారంకే కేటాయించారని అగ్రహించారు. గవర్నర్ ని అవమానం చేయాల్సిన అవసరం మాకెందుకు ఉంటుందని ప్రశ్నించారు.
రాజ్ భవన్ కు కాషాయ రంగు ఎందుకు పూస్తున్నారని నిప్పులు చెరిగారు. గవర్నర్ కు ఇబ్బంది ఉంటే సీఎం కేసీఆర్ … సెక్రటేరియట్ తో మాట్లాడుతారన్నారు. కేసులు మా మీద కాదు.. బీజేపీ నేతల మీద వేయాలని చురకలు అంటించారు. రాజ్ భవన్ కు కాషాయ రంగు పులిమి పని చేస్తుంది బీజేపీ అని మండిపడ్డారు. గవర్నర్ ని అడ్డం పెట్టుకొని సర్కార్ నీ ఇబ్బంది పెడుతున్నట్టు బీజేపీ నేతలే బయట పడుతున్నారని అగ్రహించారు.