హరీష్ జోకులు.. దుబ్బాకలో రూపాయి చెల్లిందా? అది టీడీపీ ఎఫెక్ట్?

-

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్ రావు….దూకుడు కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మామకు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది రిటర్న్ గిఫ్ట్ అయితే హరీష్ పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది. కానీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హరీష్ మాత్రం తెగ కష్టపడుతున్నారు…ఇక వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు…వరుసపెట్టి అందరిపై విమర్శలు చేసేస్తున్నారు..అసలు వన్ మ్యాన్ షో చేస్తూ హడావిడి చేస్తున్నారు.

harish rao | హరీష్ రావు

తాజాగా కూడా ఈటల రాజేందర్ తరుపున ప్రచారం చేసిన విజయశాంతిపై హరీష్ సెటైర్లు వేశారు. మెదక్‌లో చెల్లని రూపాయి వీణవంకలో చెల్లుతుందా? అంటూ రాములమ్మపై ఫైర్ అయ్యారు. ఇక 2009లో తన పుణ్యంతోనే విజయశాంతి ఎంపీగా గెలిచిందని హరీష్ చెప్పుకొచ్చారు. అటు ఈటల రాజేందర్‌ది నోరా.. లేకా మోరినా అంటూ ఫైర్ అయ్యారు. పూటకో మాట మాట్లాడుతున్న ఈటలని ఎలా నమ్మాలంటూ మాట్లాడారు.

అయితే హరీష్ సెటైర్లు బాగానే ఉన్నాయి గానీ, ఆయన కూడా చెల్లని రూపాయి అనే సంగతి మరిచిపోతున్నట్లు కనిపిస్తోంది. విజయశాంతి మెదక్‌లో ఓడిపోవచ్చు….కానీ ఓటమి ఎప్పుడు శాశ్వతం కాదు…ఆ విషయం హరీష్‌కు బాగా తెలుసు. అయినా విజయశాంతిపై కామెంట్ చేసేశారు. పైగా దుబ్బాకలో చెల్లని రూపాయిగా హరీష్ ఉన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో సిట్టింగ్ సీటునే హరీష్ గెలిపించుకోలేకపోయారు. దుబ్బాక బాధ్యతలనీ కూడా తన భుజాన వేసుకుని హడావిడి చేసి బోల్తా కొట్టారు. అంటే దుబ్బాకలో చెల్లని రూపాయి హుజూరాబాద్‌లో ఎలా చెల్లుతుందని అనుకోవాలి.

ఇక 2009లో హరీష్ దయతోనే రాములమ్మ ఎంపీ అయిందని చెప్పుకుంటున్నారు. అప్పుడు టీఆర్ఎస్‌కే దిక్కులేదు. కేవలం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అటు మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో కేసీఆర్, ఇటు మెదక్ పార్లమెంట్‌లో విజయశాంతిలు టీఆర్ఎస్ తరుపున ఎంపీలుగా గెలిచారు. ఇక పూటకో మాట, గంట గంటకు రాజకీయం మార్చేసి…మాట తప్పేది ఎవరు అనేది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి హరీష్ సెటైర్లు ఫుల్ రివర్స్ అవుతున్నాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version