ఈరోజు జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది అని తెలియచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఆసుపత్రులు బెడ్ల సంఖ్యను పెంచామన్నారు. గర్భిణీల కోసం జిల్లా ఆస్పత్రిలో టిఫా స్కాన్ ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు తెలియచేశారు మంత్రి హరీష్.
ముందు రాబోయే రోజుల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలను ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ వెల్లడించారు. లైసెన్స్ లేకుండా అనధికారంగా వైద్యం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆయన. జిల్లాలో ఏఎన్ఎం సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో ఉండకుండా, భవనాలు నిర్మిస్తున్నామని, 54 సబ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ఒక్కొక్క దానికి రూ.20 లక్షలు ఇచ్చామని అన్నారు. వాటినింటిని త్వరలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. 3లక్షల కి.మీ దాటిన 108 అంబులెన్స్ లు (200) తీసివేసి వాటి స్థానంలో కొత్తవి 200 అంబులెన్స్ లను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి హరీష్ వెల్లడించారు.