తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రిజిస్ట్రేషన్ల‌పై అద‌నంగా హ‌రిత నిధి వ‌సూల్

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో జ‌రిగే భూమి రిజిస్ట్రేషన్ లపై అద‌నంగా హ‌రిత నిధిని వ‌సూల్ చేయానున్నారు. ప్ర‌తి భూ రిజిస్ట్రేషన్ పై రూ. 50 ల‌ను వ‌సూల్ చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. హ‌ర‌త నిధి రుసుం ను స్టాంపుల రూపంలో వ‌సూల్ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వ‌ల‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ జారీ చేశారు.

ఈ ఉత్త‌ర్వుల‌ను ఈ ఏడాది మార్చి 1 వ తేదీ నుంచి అమల్లోకి వ‌స్తాయ‌ని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్ర‌తి జిల్లాలో రిజిస్ట్రేషన్ స‌మ‌యాల్లో హ‌రిత నిధి రుసుం ను త‌ప్ప‌కుండా వ‌సూల్ చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. కాగ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హ‌రిత హారం అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కులు పెంచుతున్న విషయం తెలిసిందే. దీనిలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేయ‌డానికి రిజిస్ట్రేషన్ల స‌మయంలో హ‌రిత నిధి రుసుంను వ‌సూల్ చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version