యూట్యూబ్‌లో చూసి డయోరియాకు చికిత్స తీసుకున్నాడు.. సీన్‌ కట్‌ చేస్తే..

-

ఈ మధ్య చాలా మంది యూట్యూబ్‌లో చూసి సొంతవైద్యాలు చేసుకుంటున్నారు. మొన్నటికిమొన్న ఓ వ్యక్తి తన భార్యకు యూట్యూబ్‌లో చూసి నార్మల్‌ డెలివరీ చేశాడు. చివరకి ఆమె చనిపోయింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకతను డయేరియాకు యూట్యూబ్‌లో చూసి వైద్యం చేసుకున్నాడు. ఒకేసారి పది కర్పూరం బిళ్లలను మింగేశాడు. సీన్‌ కట్‌ చేస్తే ఆరోగ్యం విషమించింది..ఆసుపత్రికి తీసుకెళ్లారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఝార్ఖండ్ రాష్ట్రంలోని లాతేహార్ జిల్లా బలుమత్ మండలంలోని టోటీ హెస్లా గ్రామంలో నివసిస్తున్న ఆవధేశ్ కుమార్ సాహుకు డయేరియా వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే చాలా ఖర్చు అవుతుందని యూట్యూబ్‌లో డయేరియా తగ్గించుకునేందుకు చిట్కాల కోసం వెతికాడు. కర్పూరం తింటే విరేచనాలు ఆగిపోతాయని ఓ వీడియో చూసి పది బిళ్లలు మింగేశాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం పూర్తిగా పాడైంది. కుటుంబ సభ్యులు కూడా ఏం జరిగిందని ఆరా తీశారు. జరిగింది చెప్పాడు..అతడిని ఆస్పత్రికి తరలించారు. స్పందించిన వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై డాక్టర్ మాట్లాడుతూ..యువకుడికి విరేచనాలు అయ్యాయని చెప్పారు. అతడు యూట్యూబ్ లో చూసి సొంతంగా చికిత్స తీసుకున్నాడని 10 కర్పూరం బిళ్లలు మింగేశాడని వివరించారు. అయితే కర్పూరం ప్రభావం అతడి శరీరంపై చాలా ఎక్కువగా ఉందని అందుకే యువకుడు కనీసం రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని తెలిపారు.

చిన్న చిన్న సమస్యలకు సొంతవైద్యాలు పనికివస్తాయి కానీ.. పెద్ద పెద్ద రోగాలకు కూడా కేవలం సొంత వైద్యంతోనే నయం చేసుకుందాం అనుకోవడం పూర్తిగా మీ తప్పే అవుతుంది. ఇవి మనుపటి రోజులు కావు.. దేన్ని అయినా ఇంట్లోనే ఉండి తగ్గించుకుందాం అనుకోవడానికి. డయబెటీస్‌కు ఎన్నో చిట్కాలు చెప్తుంటారు. వాటిని పాటించవచ్చు. కానీ అవేవి కూడా వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు. చికిత్స తీసుకుంటేనే వాటిని పాటిస్తూ షుగర్‌ లెవల్స్‌ తగ్గించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version