నీరసం మొదలు ఎన్నో సమస్యలు బీట్రూట్ తో మాయం..!

-

బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బీట్రూట్ లో పోషక పదార్థాలు నిండుగా ఉంటాయి. ఐరన్, సోడియం, పొటాషియం, పాస్ఫరస్ ఇవన్నీ మనకి బీట్రూట్ ద్వారా అందుతాయి. అన్ని సీజన్లలో ఇది దొరుకుతుంది కాబట్టి కి రెగ్యులర్ గా బీట్రూట్ ని వాడితే మంచిది. తాజా బీట్రూట్ తో జ్యూస్, సలాడ్ వంటివి చేసుకుని చక్కగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా బీట్రూట్ బాగా ఉపయోగపడుతుంది.

 

beetroot

బీట్రూట్ లో ఉండే ఫైబర్ కడుపుని శుభ్రం చేస్తుంది. అయితే ఈ రోజు మనం బీట్రూట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు పొందొచ్చు అనేది మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తుంది:

హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి బీట్రూట్ బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ తో పాటు క్యారెట్ కలిపి మీరు జ్యూస్ చేసుకుని తీసుకుంటే బీపి కంట్రోల్ లో ఉంటుంది.

ఈ సమస్యలు ఉండవు:

బీట్రూట్ లో విటమిన్ బి, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, ప్రొటీన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రక్తాన్ని ప్యూరిఫై చేసే క్రమాన్ని మరింత పెంచుతుంది. అలాగే ఆక్సిజన్ ని కూడా ఎక్కువగా ఉంచుతుంది. ఇలా మీరు ఆరోగ్యంగా ఉండడానికి బీట్రూట్ బాగా ఉపయోగపడుతుంది.

జుట్టు ఎదుగుదల కి బీట్ రూట్:

బీట్ రూట్ లో ఉండే ఫాస్ఫరస్ జుట్టు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే బీట్రూట్ ని డైట్ లో తీసుకుంటే మేలు కలుగుతుంది.

నీరసం తగ్గుతుంది:

బీట్రూట్ తీసుకోవడం వల్ల నీరసం నుండి మీరు బయటపడొచ్చు. ఎముకలకి మరియు పళ్ళకి కూడా మంచిది. బీట్ రూట్ లో ఉండే కాల్షియం ఎముకలు మరియు పళ్ళ సమస్యలకి దూరంగా ఉంచుతుంది. ఇలా బీట్రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరెంత ఆరోగ్యంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news