చలికాలంలోనే గుండెపోటు ఎక్కువగా వస్తుందట.. కారణం అదే..!

-

సీజనల్‌ రోగాల గురించి మనకు తెలుసు.. కానీ గుండెపోటుకు కూడా ఒక సీజన్‌ ఉంటుందని మీకు తెలుసా.. ఇవి ఎప్పుడైనా వస్తాయి అని అందరూ అనుకుంటారు.. అది నిజమే.. అయితే చలికాలంలో గుండెపోటు ఇంకా ఎక్కువగా వస్తుందట.. హార్ట్‌ పేషంట్స్‌ ఎవరైనా ఉంటే వాళ్లు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి..రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం కూడా చల్లగానే అనిపిస్తుంది..ఇక సాయంత్రం ఆరైతే చాలు..చలి స్థాయి బాగా ఎక్కువవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో గుండెపోటు కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
నివేదికల ప్రకారం.. గత ఐదు రోజుల్లోనే 98 మంది గుండెపోటు లేదా స్ట్రోక్ కారణంగా మరణించినట్టు తెలిసింది. వీరిలో 44 మంది ఆసుపత్రికి తీసుకువచ్చాక మరణిస్తే, 54మంది చికిత్స అందేలోపే మరణించారు. దీన్ని బట్టి చలికాలంలో గుండెపోటు అధికంగా వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గత వారంలో వందల కొద్ది గుండెపోటు బాధితులు అత్యవసర విభాగాల్లో చేరడం, ఔట్ పేషెంట్ విభాగంలో వచ్చి వైద్యుల్ని సంప్రదించడం జరిగింది…ఎందుకు ఇలా జరుగుతుంది? చలికాలంలోనే గుండెపోటు అధికంగా ఎందుకు వస్తుంది? సైంటిఫిక్‌గా ఏమైనా కారణాలు ఉన్నాయా..?

గుండెపోటుకు కారణాలు ఇవే…

 అధిక కొలెస్ట్రాల్
 అధిక రక్తపోటు
 అధిక ఒత్తిడి
 ధూమపానం
 ఆల్కహాల్ అధికంగా తాగడం
 ఊబకాయం
 రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం..
వీటి కారణంగా సాధారణంగా గుండెపోటు వస్తుంది. అయితే శీతాకాలంలో చల్లని ఉష్ణోగ్రతల వల్ల కూడా గుండె పోటు రావడం కలవరం సృష్టిస్తోంది.

చలికాలంలో ఎందుకు..?

చల్లని వాతావరణం ఉన్నప్పుడే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. దీనికి కారణం చలికాలంలో రక్తనాళాలు సంకోచిస్తాయి అంటే దగ్గరగా కూడుకుపోయినట్టు అవుతాయి. దీనివల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. దీన్నే వైద్య భాషలో ‘వాసో క్యాన్స్ట్రిక్షన్’ అంటారు. ఇది అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. దీనివల్ల గుండెపోటు వస్తుంది. సాధారణంగానే కరోనరీ ధమనులు ఇరుకుగా ఉంటాయి. ఇక శీతాకాలంలో అవి ఇంకా సంకోచిస్తే, రక్తప్రసరణకు కష్టమవుతుంది.. కాబట్టి చల్లగాలులకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ టైమ్‌లో మార్నింగ్‌ వాక్‌ వద్దు..

ఈ సీజన్‌లో ఉదయపు నడకలు మానేస్తే మంచిది. చాలామంది ఉదయం ఐదు గంటలకి, ఆరు గంటలకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వాకింగ్‌కు వెళ్తుంటారు. చలికాలంలో ఆ ఉదయపు నడకను వాయిదా వేసుకుని, ఎండ వచ్చిన తర్వాత వెళ్లడం మంచిది. అలాగే చలివేయకుండా మందంగా ఉండే దుస్తులు ధరించాలి. చెవులలోకి చల్లగాలి వెళ్ళకుండా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news