కంటి వెలుగును గిన్నిస్ బుక్కులో ఎక్కించాలి: మంత్రి మల్లారెడ్డి

-

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కంటి వెలుగు-2 మేడ్చల్ జిల్లా సమావేశంలో మాట్లాడారు. కంటి వెలుగు గిన్నిస్ బుక్కులో ఎక్కించాల్సిన పథకం అన్నారు. ఇలాంటి అత్యద్భుతమైన పథకాలు కేవలం సీఎం కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమవుతాయని చెప్పుకొచ్చారు. ప్రజల బాగోగులకై పరితపించే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మనకు అండదండగా ఉంటారన్నారు. 2023 జనవరి 18 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈనెల 18 నుంచి చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కంటి చూపుతో బాధపడుకుండా ఉండేందుకు రూ. 250 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కంటి వెలుగు ద్వారా కల్గిందన్నారు మంత్రి మల్లారెడ్డి. సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు మంత్రి మల్లారెడ్డి. శిబిరానికి రాలేని వారిని తీసుకెళ్లి కంటి పరీక్షలు నిర్వహించేందుకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యులు సిబ్బంది పరీక్షలు చేస్తారని తెలిపారు మంత్రి మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news