హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం..

-

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వరకు ఆకాశమంతా మేఘావృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌, బాలనగర్‌, బేగంపేట, అమీర్‌పేట, మల్కాజ్‌గిరి, కాప్రాతో పాటు పరిసరాల ప్రాంతాల్లో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అంతేకాకుండా పాఠశాలల నుంచి ఇండ్లకు చేరుకున్న విద్యార్థులు సైతం ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా పలు చోట్ల భారీ వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేటర్‌ మున్సిపల్‌ సిబ్బంది రోడ్లపైకి వచ్చిన నీటిని తొలగిస్తున్నారు. కొన్ని చోట్ల భారీ ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. సుమారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version