శభాష్‌ : బైక్‌ సహా కొట్టుకుపోతున్న వారికి కాపాడిన స్థానికులు

-

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. హైదరాబాద్‌లో కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ మాన్‌సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అయితే.. భారీ వర్షాలతో ఇప్పటికే కొన్నిచోట్ల రోడ్డల తెగిపోయి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు చోట్ల రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అయితే ఇప్పటికే అధికారులు అలాంటి పరిస్థితులు్లో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

అయినా వినకుండా కొంత మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఈఘటనే ఇది.. వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట మండలం గురిజాల గ్రామ శివారులో గల రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అయితే.. ఇప్పటికే అధికారులు ఆ రోడ్డు నుంచి రాకపోకలు సాగించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఒక వ్యక్తి బైక్‌పై ఆ ప్రవాహంలోనే అవతలై వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి బైక్‌తో సహా వరద నీటిలో కొట్టుకోకుపోయాడు. అయితే వెంటనే గమనించిన స్థానికులు అతడితో పాటు బైక్‌ను పైకి లాగారు. కానీ.. బైక్‌ జారీ పోవడంతో వరద నీటిలో కొట్టుకుపోయింది. కానీ.. సదరు వ్యక్తిని మాత్రం కాపాడారు. అయితే.. అతడిని కాపాడిని స్థానికులపై ప్రశంసలు కురిపిస్తున్నారు గ్రామస్థులు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version