మన దేశంలో ‘సెక్స్’ ఈ పదం అనడానికి, వినడానికి చాలా మంది బిడియంగా ఫీలవుతారు. అసలు, ఆ పదం వాడటమే తప్పుగా భావిస్తారు. మరోవైపు, సెక్స్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి సుముఖత చూపించినా, దాన్ని బాహాటంగా ఒప్పుకోవడానికి సిగ్గుగా ఫీలవుతారు. కొన్ని దేశాల్లో అయితే, శృంగారానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించినా నేరంగా పరిగణిస్తారు. మన సంప్రదాయాలు, సంస్కృతి ప్రకారం దాని గురించి మాట్లాడటమే తప్పుగా భావిస్తారు.
అందుకే ప్రముఖ కాలమిస్ట్, సెక్స్ అండ్ కపుల్స్ కోచ్ పల్లవి బర్నావల్ వార్త పత్రికతో మాట్లాడుతూ.. ‘సెక్స్’ అనే పదానికి సరైన అర్థం ఏంటో చెప్పడానికి, అదేవిధంగా పెళ్లైన కపుల్స్ కు శృంగారంపై అవగాహన కల్పించడానికి వారి మధ్య అన్యోన్యత పెరగటానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు.
దీనికి ప్రధాన కారణం సెక్స్‌పై అవగాహన లోపం. సెక్స్ ..అస్సలు ఆ పదం అంటేనే తప్పు, డర్టీ, మాట్లాడితే మీ కేరక్టర్ గురించి చెడుగా అనుకుంటారు. అందరూ ఏమనుకుంటారో? ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారో అనే ఆలోచన ల్ని మొదటగా మైండ్ లోంచి తీసివేయాలని పల్లవి తెలిపారు. చాలా మంది సెక్స్‌కు సంబంధించిన తన కాంమెట్లపై స్పందించాలనుకుంటారట, కానీ, తమ కుటుంబీకులు ఏమనుకుంటారో అని వెనుకడుగు వేస్తున్నామని తనకు మెయిల్స్ పెట్టినవారు కూడా ఉన్నారని అంటోంది ఆమె. అలాగే చాలామంది శృంగారం గురించి మాట్లాడటానికి ఏ మాత్రం ప్రోత్సహించని సొసైటీ కట్టుబాటులే పరిమితవుతున్నారని పల్లవీ అన్నారు. కోవిడ్ వ్యాప్తికి ముందు సెక్స్ అవగాహన కోసం వర్క్‌షాప్‌లు కూడా పెట్టిన ఆమెకు రిలేషన్‌షిప్ గురించి మాట్లాడేది. కానీ, పెళ్లైన జంటాల్లో ఒకరు తమ వైవాహిక జీవితం గురించిన సమస్యలను తెలుసుకోవడానికి , వస్తే మరికొందరు ఆ విషయాలపై మాట్లాడటానికే సుముఖత చూపరు. ఎందుకంటే మన భారత్‌లో కౌన్సిలింగ్ అంటే నే కోపగించుకుంటారు. చాలా మంది సెక్స్ థెరపిస్ట్‌లను కలుస్తారు, వారు వారి వైవాహిక బంధం చాలా విచారకరంగా ఉందని చెబుతారు.
ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో వారు ఎక్కువ సేపు గడపాల్సిన సమయం దొరుకుతుంది. అది తప్పేం కాదు. కానీ, కుటుంబ బాధ్యత కూడా ఒక్కరిపైనే ఆధారపడటం వల్ల కొన్ని గొడవలు కూడా రావచ్చు. ఒక్కవ్యక్తి తోనే ఇంటి బాధ్యత నెట్లుకు రావడం నా ఉద్దేశంలో అది కుదరని పని. సోషల్ నెట్‌వర్క్‌ను పెంచుకోవాలి. కొడుకు కోడళ్లు ఇంటిలోని సభ్యుల వల్ల కూడా మీ మధ్య ప్రైవసీ ఉండకపోవచ్చని’ పల్లవి అన్నారు. కపుల్స్ మధ్య ఏదైన జరిగితే వారి అన్యోన్యతపై ప్రభావం పడుతుంది. పెళ్లైన కొత్తలో అయితే అత్తాకోడళ్ల మధ్య అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వారు శృంగారంపై అవగాహన కల్పించే అస్కారమే ఉండదు.
కొన్ని ప్రశ్నలకు పల్లవీ చెప్పిన సమాధానాలు..
‘సెక్స్’ కోచ్ ఏ విషయాలు చెబుతారు?
సెక్స్ కోచ్ అంటే రిలేషన్‌షిప్ కోచ్ కాదు. ఈ రెండు వేరే విషయాలు. మా గ్రూప్ కౌన్సిలర్స్‌తో సెక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గుపడే వ్యక్తుల సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లైంట్ సమస్యల్ని సరిగ్గా గుర్తించి పరిష్కరిస్తే ఒకే. కొంత మంది క్లైంట్స్‌కు సమస్యని ఎలా చెప్పాలో కూడా తెలియని దుస్థితి. సమస్యని పరిష్కరించమని అడుగుతారు. వెస్ట్రన్ కల్చర్‌లో సెక్స్ థెరపీ, ఎడ్యుకేషన్,కోచింగ్ సర్వసాధరాణం. అక్కడ సెక్స్, రిలేషన్‌షిప్ ఒకటే.
సెక్స్ కోచ్ చాలా రకాల సమస్యల్ని వారికి షేర్ చేయాల్సి ఉంటుంది. కపుల్స్‌లో ఒకరు సెక్స్‌కు ఇష్టపడితే, మరొకరికి దానిపై ఏమాత్రం అవగాహన ఉండదు. ఒక్కోసారి వారిమధ్య 5, 10, 15 ఏళ్లకు కూడా శృంగార జీవితాన్ని అనుభవించని దుస్థితి ఏర్పడుతుంది.