ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది. దీన్నే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం కానుంది. మన భారతీయ సంస్కృతిలో గ్రహణాలపై అపర నమ్మకం ఉంటుంది. గ్రహాల పరంగా కూడా వీటిని మనం నమ్ముతాం. మన ఆచారం ప్రకారం గ్రహణం మంచిది కాదని అర్థం. ఈ గ్రహణ వేళల్లో అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. అయితే, ఈ ఏడాది ఎప్పుడెప్పుడు గ్రహణాలు ఏర్పడనున్నాయో తెలుసుకుందాం.
మే 26.. చంద్ర గ్రహణం
2021 మొదటి గ్రహణం మే 26న రానుంది. ఇది దేశం మొత్తంలో కనిపించదు. సంపూర్ణంగా ఏర్పడే చంద్ర గ్రహణాన్ని బ్లడ్ మూన్ అంటారు. సూపర్ మూన్ అంటే సాధరణ పరిమాణం కంటే కాస్త పెద్దదిగా చంద్రుడు కనిపిస్తాడు.
నవంబర్ 19.. మరో గ్రహణం
ఆ తర్వాత మరో చంద్ర గ్రహణం నవంబర్ 19న వస్తుంది. ఇది కూడా మన దేశంలో కనిపించనుంది.
మొదటి సూర్యగ్రహణం..జూన్ 10
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం జూన్ 10న రానుంది. అంటే మే లో రానున్న చంద్ర గ్రహణం ఏర్పడిన కొన్ని రోజులకే, సూర్య గ్రహణం రానుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. అంటే మన దేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. జూన్ 10 మధ్యాహ్నం 1.42 సమయం నుంచి సాయంత్రం 6.41 మధ్య ఏర్పడనుంది. ఈ గ్రహణం ఎక్కువ శాతం ఆసియా, ఉత్తర ఆఫ్రీకా, పశ్చిమ ఆఫ్రీకా, ఆర్కిటిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపించనుంది.
డిసెంబర్ 4న మరో గ్రహణం
ఆ తర్వాత డిసెంబర్ 4న రెండో, ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. కానీ, మన దేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది.
గ్రహణ వేళల్లో ఏం చేస్తారు?
గ్రహణం ఏర్పడే సమయంలో ఎక్కువ శాతం దేవుడిని స్తుతిస్తే మంచిదని నమ్మకం. దేవుడి మంత్రాలను పాఠిస్తారు. అలాగే, ఈ సమయాల్లో తినడం, తాగటం, వంట చేయడం వంటి పనులు ఏమి చేయరు, బయటకు కూడా వెళ్లరు.
గ్రహణ సమయంలో చేయకూడనివి
ఆహారం తీసుకోకూడదు. ఇది ప్రెగ్నెంట్ ఉన్న ఆడవారికి, రోగులకు వర్తించదు. అదేవిధంగా నేరుగా గ్రహణం ఏర్పడటాన్ని చూడకూడదు అంటారు. మైక్రోస్పోప్, గ్లాసస్ ద్వారా చూడవచ్చు.
కడుపుతో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఇంట్లోనే ఉండాలి. గ్రహణ వేళల్లో బయటకి వెళితే గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుందని మన పెద్దలు చెబుతారు.